క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో క్రీడాకారులకు ప్రోత్సాహం అందజేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం
క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్
మంథని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో క్రీడాకారుల ప్రోత్సాహం అందజేస్తామని ఆయన తెలిపారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీడలు ఆడుకునే క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా మున్సిపల్ పరంగా చర్యలు తీసుకుంటామని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం మంథని జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు మాచిడి రాజు గౌడ్ ,ఎల్లంకి వంశీధర్, పోతరవేన శ్రీలత క్రాంతి కుమార్ లను వారు సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
కళాశాల మైదానంలో ప్రతిరోజు ఉదయం వాకర్స్ తో పాటు మార్నింగ్ క్రికెట్ ఆడుకునే వారితో గ్రౌండ్ సందడిగా మారుతుందన్నారు. క్రికెట్ క్రీడ కూడా శరీరానికి మంచి వ్యాయామం ఇస్తుందని ప్రతిరోజు క్రికెట్ ఆడేవారు సంతోషంగా ఉంటారని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రౌండ్ ను శుభ్ర పరచడంతో పాటు క్రికెట్ పిచ్ పైన వాటర్ కొట్టించి శుభ్రపరుస్తామని తెలిపారు. మార్నింగ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగం వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో. ఉపాధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆకుల అజయ్, సహాయ కార్యదర్శి డాక్టర్ రాజేంద్రప్రసాద్, కోశాధికారి రవికుమార్, కార్యవర్గ సభ్యులు కొండపర్తి నరేష్, సతీష్ కుమార్, రాజు తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
