కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు

బాపట్ల కలెక్టరేట్, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ శాఖలలో, ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు మరింత సమాచారంతో నవంబర్ మొదటి గురువారం సమీక్షలో పూర్తి చేసిన పనులు.. మిగిలి ఉన్న పనులు… అన్ని నివేదిక రూపంలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎస్ఇ పంచాయతీరాజ్, జిల్లా ఆర్ అండ్ బి అధికారి, సమగ్ర శిక్షా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ ఎస్ ఇ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఇ, మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, మైండ్స్ అండ్ జువాలజీ శాఖ అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ వినోద్ కుమార్ నేటి సమీక్షలో వెల్లడించారు.

Leave a Reply