కలెక్టర్‌గా డాక్టర్ వినోద్ కుమార్ బాధ్యతల స్వీకరణ
బాపట్ల బ్యూరో (ఆంధ్రప్రభ) : బాపట్ల జిల్లా కలెక్టర్ (Bapatla District Collector)గా డాక్టర్ వినోద్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. వాసుదేవ వినోద్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన ఇంచార్జి జేసీ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏవో మల్లి కార్జునరావు, అధికారులు వేద మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ వినోద్ కుమార్ ( Collector Vinod Kumar)కు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ వినోద్ కుమార్ ను ఆంధ్రప్రభ (Andhra Prabha) టీం పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికింది. ఈరోజు ఆంధ్రప్రభ సంచికను అందజేయగా.. ఆంధ్రప్రభ సంచిక లో వచ్చిన వార్తలపై కలెక్టర్ రిపోర్టర్లతో మాట్లాడారు. ప్రధానంగా యూరియా (Urea) సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా ఈరోజే గ్రామాలలో పర్యటించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ వినోద్ కుమార్ మొదటిగా ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి డాక్టర్ అయ్యారు. ఆ తరువాత 2004 -05 ఐఏఎస్ బ్యాచ్ కు ఎంపికయ్యారు. గతంలోనే అనంతపురం ఉమ్మడి జిల్లా ట్రెయినీ కలెక్టర్ (Trainee Collector) గా తన కెరీర్ ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా, రంపచోడవరం సబ్ కలెక్టర్ గా, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా సేవలందించారు. పార్వతీపురం ట్రైబల్ వెల్ఫేర్ లోను సేవలందించారు, గ్రామీణ తాగు నీరు మైండ్స్ ల్యాండ్ తదితర శాఖల్లో పని చేశారు. 2024 ఏప్రిల్ 3న అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. నేడు జరిగిన 12 మంది కలెక్టర్ల బదిలీల్లో భాగంగా బాపట్ల జిల్లా నాలుగవ కలెక్టర్ గా డాక్టర్ వినోద్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రభ బాపట్ల జిల్లా బ్యూరో మురళీకృష్ణ డెల్టా ఇంచార్జ్ రాము కలెక్టరేట్ రిపోర్టర్ శ్రీకాంత్ ప్రత్యేకంగా కలిసి ఆంధ్రప్రభ సంచికను అందజేశారు.

