క‌లెక్ట‌ర్ ఈవీఎం గోదాముల త‌నిఖీ

క‌లెక్ట‌ర్ ఈవీఎం గోదాముల త‌నిఖీ

వ‌రంగ‌ల్, న‌వంబ‌ర్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని గోదాములను కలెక్టర్ డాక్టర్ సత్య శారద (Collector Dr. Satya Sarada) గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డును సంద‌ర్శించారు.

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంల (Strong room warehouses) కు సంబంధించిన రికార్డులు త‌నిఖీ చేవారు. కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply