( అనంతపురం బ్యూరో , ఆంధ్ర ప్రభ): అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం మధ్యాహ్నం అనంతపురం(Anantapur) చేరుకున్నారు. నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో నూతన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్(Anand)కి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మలోల, తహసీల్దార్ హరికుమార్, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు దివాకర్ బాబు, తదితరులు పూలమొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

Leave a Reply