Collector | సిద్దేశ్వర్ సంస్థాన్ లో పూజలు చేసిన అడిషనల్ కలెక్టర్ డేవిడ్

Collector | సిద్దేశ్వర్ సంస్థాన్ లో పూజలు చేసిన అడిషనల్ కలెక్టర్ డేవిడ్

శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్, అధికారులు

Collector | జైనూర్, ఆంధ్రప్రభః కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ లోని సద్గురు పులాజి బాబా సిద్దేశ్వర్ సంస్థాన్ లో శివరాత్రి ఉత్సవ వేడుకల్లో ఆసిఫాబాద్ రెవెన్యూ విభాగ అడిషనల్ కలెక్టర్ డేవిడ్ దంపతులతో బంధువులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సద్గురు పూలాజి బాబా చేసిన ఆధ్యాత్మిక సేవలు ఎంతో గొప్ప వని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. శివరాత్రి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పట్నాపూర్ సర్పంచ్ కందారే లక్ష్మి బాలాజీ, జైనూర్ తాసిల్దార్ ఆడ బిర్షావ్, సిద్దేశ్వర సంస్థాన్ అధ్యక్షులు ఇంగ్లె కేశవ్ రావు దాదా, ఉపాధ్యక్షులు వామన్ రావు దాదా, కార్యదర్శులు దుక్రె సుభాష్, జనార్దన్, దాదా రావు, జైవంత్ రావు మహారాజ్,అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply