COLLECTOR | పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి
- ఉదయం 7 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్,
- 137 పంచాయతీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం,
- నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్,
COLLECTOR | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి సంసిద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాగర్ కర్నూల్ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ మాట్లాడుతూ…. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి విడత ఎన్నికల కోసం 6వేల మందికి పైగా ఎన్నికల అధికారులు తొలి విడత ఎన్నికల్లో వివిధ హోదాల్లో విధుల్లో పాల్గొంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో 151 గ్రామ పంచాయతీలు ఉండగా , 14 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 137 గ్రామ పంచాయతీలకు గాను 447 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారన్నారు. ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులకు ముడు విడుతలలో శిక్షణ ఇచ్చాం. సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ వంటివి నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
1326 వార్డులకు గాను , 208 వార్డులు ఏకగ్రీవమయ్యాయని, 1,118 వార్డులకు గాను 2774 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఆయా అభ్యర్థులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలియజేశారు. కల్వకుర్తి, ఊర్కోండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి ఆరు మండలాలకు గాను 1,118 పోలింగ్ కేంద్రాలు, 1,118 పిఓ లు, 3000 ఓపిఓలు, 151 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
కల్వకుర్తి మండలంలో 24 గ్రామపంచాయతీ లు 214 వార్డులు,
పురుష ఓటర్లు 15,803
మహిళా ఓటర్లు 15,703
మొత్తం……….31511
ఊర్కోండ మండలంలో 16 గ్రామపంచాయతీలు,138 వార్డులు,
పురుష ఓటర్లు 8868
మహిళా ఓటర్లు 9119
మొత్తం………. 17,987
వంగూరు మండలంలో 27 గ్రామపంచాయతీ లు, 228 వార్డులు,
పురుష ఓటర్లు 16,498
మహిళా ఓటర్లు 17000
మొత్తం…………33,498
వెల్దండ మండలంలో 32 గ్రామపంచాయతీలు, 270 వార్డులు,
పురుష ఓటర్లు 17,163
మహిళా ఓటర్లు 16,995
మొత్తం……….33,498
తాడూరు మండలంలో 24 గ్రామపంచాయతీ లు,216 వార్డులు,
పురుష ఓటర్లు 14,968
మహిళా ఓటర్లు 15187
మొత్తం…….30,155
తెలకపల్లి మండలంలో 28 గ్రామపంచాయతీలు, 260 వార్డులు,
పురుష ఓటర్లు 22,325
మహిళా ఓటర్లు 22,520
ఇతరులు…2
మొత్తం…………44,847
మొదటి విడతలు జరిగే ఎన్నికల్లో 9,56,25 మంది పురుష ఓటర్లు, 9,65,29 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఇద్దరు, మొత్తం 1,92156 మంది ఓటర్లు రేపు గురువారం మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
మొదటి విడతలో జరిగే ఎన్నికలకు 55 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు 32 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ప్రక్రియను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కొనసాగి పోలింగ్ ప్రక్రియలను జిల్లా కలెక్టరేట్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేరుగా వీక్షించేలా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ, పోటీచేస్తున్న అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని, నిన్నటి సాయంత్రం 5 గంటల నుంచి గురువారం ఓట్ల లెకింపు పూర్తయి, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

