Collector l త్రాగునీటి, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరిస్తాం..

Collector l త్రాగునీటి, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరిస్తాం..
Collector l కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. పెద్దకడబూరు మండల కేంద్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రజలతో మాట్లాడుతూ పెన్షన్ సరైన సమయానికి ఇస్తున్నారా, పెన్షన్ ఇచ్చే సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నారా, గ్యాస్ సిలిండర్ బాయ్స్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారా, పారిశుద్ధ్య సిబ్బంది ఇంటికి వచ్చి చెత్త సేకరిస్తున్నారా, లేదా అని ఆరా తీశారు.. పెన్షన్ సరైన సమయానికి ఇస్తున్నారని, ఎలాంటి డబ్బులు అడగడం లేదని, చెత్త సేకరణ చేస్తున్నారని ప్రజలు కలెక్టర్ కు వివరించారు. త్రాగునీటి, డ్రైనేజ్, రోడ్ సమస్యలను పరిష్కరించాలని పెద్దకడబూరు ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలు కలెక్టర్ ను కోరారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారిని ఆదేశించారు. ప్రజలు తన దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, డి ఎస్ ఓ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

