Collector | వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Collector | వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ కేంద్రాల పరిశీలన
Collector | జోగులాంబ గద్వాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఈ రోజు ఐడీఓసీ సమావేశపు మందిరంలో వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఐజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మొత్తం 74 గ్రామ పంచాయతీలలో 18 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామ పంచాయతీలలో సర్పంచ్ తో పాటు 494 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో మొత్తం 567 మంది ప్రిసైడింగ్ అధికారులు, 818 మంది ఓపిఓ లు విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. ఆయా గ్రామ పంచాయతీలలో మొత్తం 1,12,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, డిపిఓ శ్రీకాంత్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
