కోడిపందాల నిర్వాహకులు అరెస్టు

కోడిపందాల నిర్వాహకులు అరెస్టు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మండలంలోని గుంటూరు గ్రామ శివారులో కోడిపందాల నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తూరు గ్రామ శివారులో గల మామిడి తోటలో కోడిపందాలను నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేయగా కోడి పందాలు నిర్వహిస్తున్న, నలుగురు వ్యక్తులతో పాటు రూ. 65,400, 17 కోళ్లు, 4 సెల్ ఫోన్లు, 3 మోటర్ సైకిల్లు, ఒక బొలెరో వాహనం ను సీజ్ చేసి నిర్వాహకుల మీద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

Leave a Reply