ఊట్కూర్ లో నాగుపాము కలకలం
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా (Narayanpet district) ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము ఈ రోజు తీవ్ర కలకలం రేపింది. కార్యాలయానికి అధికారులు, సందర్శకులు చేరుకున్నారు. అదే సమయంలో ఎంపీడీఓ చాంబర్ నుంచి స్టోర్ రూమ్‌లోకి వెళుతున్న పాము (snake) ను చూసి వారంతా పరుగులు తీశారు.
అందులో కొందరు చొరవ తీసుకుని పామును చంపి వేశారు. కార్యాలయంలోని స్టోర్ రూమ్ (Store room) లో చెత్తాచెదరం ఉండడంతో అందులో పాములు ఉన్నాయని కార్యాలయ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. స్టోర్ రూమ్ శుభ్రం చేయాలని కోరుతున్నారు.