YCP | ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా…

విజయనగరం, ఆంధ్రప్రభ : పేదలకు అందాల్సిన విద్యా – వైద్య సేవలను ప్రైవేటీకరించే కూటమి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ (YCP) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ ప్రజా ఉద్యమ ర్యాలీలు (Public movement rallies) పెద్ద ఎత్తున నిర్వహించారు. సాలూరు, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వ పోకడలను ఎండగట్టారు.

సాలూరు నియోజకవర్గం (Salur Constituency) లో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చీపురుపల్లిలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అక్కడ పోలీసులు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు తోపులాట జరిగింది.

Leave a Reply