నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం..

నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : నిరుపేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ క్లస్టర్ ఇన్ ఛార్జ్, టీడీపీ మచిలీపట్నం మాజీ ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు (వెంకన్న) అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్న 30, 32 డివిజన్లకు చెందిన పోతన లావణ్య, అరేపల్లి దేవదాసుకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న లావణ్యకు రూ.1.43లక్షలు, బ్రైన్ స్టోక్ కు గురై శస్త్ర చికిత్స చేయించుకున్న దేవదాసుకు రూ.83వేలు చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న బాధితులు మంత్రి కొల్లు రవీంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పిప్పళ్ల వెంకన్న మాట్లాడుతూ.. పేదవాడి ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నట్టు తెలిపారు.

మచిలీపట్నంలో ఇప్పటి వరకు 651 మందికి రూ.6కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల 30వ డివిజన్ కు చెందిన వినయ్ అనే వ్యక్తికి కిడ్నీ మార్పిడి నిమిత్తం కూటమి ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందన్నారు. ఇటు ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వడ్లమూడి పార్వతీశ్వరరావు, 32వ డివిజన్ టీడీపీ ఇన్ ఛార్జ్ నారగాని కృష్ణ, జనసేన ఇన్ ఛార్జ్ గున్నం వాసు, 30వ డివిజన్ జనసేన ఇన్ ఛార్జ్ ఏరువ హేమశ్రీ, వెస్ట్ బ్లాక్ నీటి సంఘం అధ్యక్షులు వీరవల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply