ప్రతి బాధితునికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు..
లక్షెట్టీపేట్, ఆంధ్ర ప్రభ : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ రోజు స్థానిక మార్కెట్ యార్డ్ లో దండేపల్లి , లక్షెట్టిపేట్ మండలాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి(Chief Minister) సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(Prem Sagar Rao) ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రతి బాధితునికి సీఎంఆర్ఎఫ్(CMRF) చెక్కులు అందుతున్నాయని తెలిపారు. అనంతరం 95 మంది లబ్దిదారులకు రూ. 29,0,4000 ల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

