CM Tour |నేడు అనంతపురం లో చంద్రబాబు పర్యటన

వెలగపూడి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు ఉరవకొండ నియోజకవర్గం లో హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్‌ పనులను ఆయన పరిశీలిస్తారు.

సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.. 10:40 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి 11:20 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 11:30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 12:00 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం చేరుకుంటారు. 12:10 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ఛాయాపురం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పరిశీలిస్తారు.

అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం 12:45 గంటలకు సీఎం చంద్రబాబు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి బయలుదేరి 12:50 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. 12:50 గంటల నుంచి 01:30 గంటల వరకు రిజర్వ్ టైమ్.. తర్వాత 2 గంటల నుంచి 3:30 గంటల వరకు ఛాయాపురం గ్రామపంచాయతీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి 3:35 గంటలకు బయలుదేరి 3:40 గంటలకు హెలిప్యాడ్‌కు వెళతారు. 3:45 గంటలకు ఛాయాపురం హెలిప్యాడ్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 4:15 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం 4:25 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply