CM – సీఎం సారూ..

CM – సీఎం సారూ..

చిన్నగూడూరు, ఆంధ్రప్రభ – చిన్నగూడూరు (Chinna Guduru) మండల కేంద్రంలోని రామచంద్ర తండాకు చెందిన రైతు బాధావత్ శంకర్ ఇంటి ముందు ఎండబెట్టిన పత్తి మంగళవారం రాత్రి మంటల్లో దగ్ధమైంది. మొత్తం 50 క్వింటాళ్ల పత్తి కాలిపోగా, దాని మార్కెట్ విలువ సుమారు రూ.3.5 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా.

బాధితుడు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి ముందు ఎండబెట్టిన పత్తికి అకస్మాత్తుగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. గమనించే లోపే మొత్తం పత్తి మంటల్లో బూడిదైపోయింది. పత్తి సాగు కోసం అప్పులు చేసి ఎంతో కష్టపడి పంట పండించాను. ఇప్పుడు అన్నీ నాశనమయ్యాయి. ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం సహాయనిధి (CM Revanth Reddy) ద్వారా బాధిత రైతుకు తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply