Delhi | మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ కార్యవర్గంతో పాటు పలు అంశాలపై ఖర్గేతో చర్చించారు.

ఎస్సీ వర్గీకరణ, కుల గణన అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఖర్గేకు వెల్లడించారు. సూర్యాపేటలో ఈ నెలలో నిర్వహించనున్న బీసీ కుల గణన బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏప్రిల్‌లో గజ్వేల్‌లో సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు రావాలని ఖర్గేను సీఎం రేవంత్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *