తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు వెళ్లారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెన్నై చేరుకున్నారు.
కాగా, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో రేపు చెన్నైలో డీలిమిటేషన్‌పై జరిగే అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొంటారు.