సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం దిల్దార్ నగర్ గ్రామానికి చెందిన చిట్యాల హరీష్‌కు రూ.60 వేల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కును గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ మాట్లాడుతూ, పేద ప్రజలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
