సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలి..

సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలి..
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం…
మునుగోడు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సూచించారు. బుధవారం మునుగోడులోని సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మునుగోడు, రామన్నపేట, కట్టంగూరు, మండలాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్నవారు ప్రభుత్వ ఆసుపత్రులు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం, బొలుగురి నరసింహ, మండల కార్యదర్శి చాపల శ్రీను,సురిగి చలపతి,ఈదులకంటి కైలాస్,బండారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
