Tributes | సీఎం రమేష్ మాతృ మూర్తికి చప్పిడి నివాళులు

Tributes | సుండుపల్లె (అన్నమయ్య జిల్లా) ఆంధ్రప్రభ : అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నాయుడు మాతృమూర్తి చింతకుంట రత్నమ్మకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు నివాళులర్పించారు. ఇటీవల ఎంపీ మాతృ మూర్తి చింకుంట రత్నమ్మ పరమపదించారు. దీంతో ప్రొద్దటూరు సమీపంలోని పొట్లదుర్తిలో ఎంపీ నివాసంలో శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డితో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు చింతకుంట రత్నమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నాయుడుతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికీ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
