CM – ఢిల్లీలో సీఎం..

CM – ఢిల్లీలో సీఎం..

ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తైన సందర్భంగా డిసెంబర్ 9 నుంచి పది రోజులు పాటు నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని (Sonia Gandhi) ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. గురువారం ఢిల్లీలో రేవంత్ బస చేసి సోనియా గాంధీని కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరనున్నారు. ఒకవేళ సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోతే లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత రాహుల్ గాంధీ, (Rahul Gandhi) పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ, (Priyanka Gandhi) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ది రామయ్య (కర్నాటక), సుఖ్విందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్)లను పిలవాలని సీఎం ప్రతిపాదించినట్టు సమాచారం.

2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన తుక్కుగూడ ప్రాంతంలోనే రెండేళ్ల విజయోత్సవ సభ నిర్వహించాలని 33 జిల్లాల నుంచి సభకు జన సమీకరణ చేపట్టాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు బుధవారం సీఎం రేవంత్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో మాట్లాడి వచ్చే నెల 9 నుంచి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు సోనియా గాంధీని ముఖ్యఅతిధిగా వచ్చేలా ఒప్పించాలని కోరినట్టు సమాచారం. అలాగే జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని.. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, తాను సమాచారం సేకరించానని అంతా సానుకూలంగా ఉందని చెప్పినట్టు సమాచారం.

Leave a Reply