CM Cup Torch Rally | క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు

CM Cup Torch Rally | క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు

  • సీఎం కప్ క్రీడా జ్యోతిని వెలిగించి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి
  • అందజేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
  • ఘనంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ
  • గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యం..
  • ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,

CM Cup Torch Rally | నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ పట్టణంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుండి ముఖ్యమంత్రి కప్ (సీఎం కప్) టార్చ్ ర్యాలీతో కలిసి టార్చిని వెలిగించి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి అందజేసి, జెండాఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే ‘సీఎం కప్’ ప్రధాన లక్ష్యమని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు.

CM Cup Torch Rally

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుండి నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. గ్రామీణ యువత క్రీడల వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా మార్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం లభించడమే కాకుండా, అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం సిద్ధిస్తుందని తెలిపారు. పల్లె స్థాయి నుండి వచ్చిన క్రీడాకారులు పట్టుదలతో శ్రమిస్తే ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగవచ్చని, దానికి సీఎం కప్ వంటి వేదికలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. సీఎం కప్ ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు.

CM Cup Torch Rally

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి సాధన చేసి, జిల్లాలోనే కాక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో గత రెండు సంవత్సరాలుగా విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో రాణించి జీవితంలో అత్యుత్తమ స్థాయిలో రాణించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

CM Cup Torch Rally

గ్రామీణ ప్రాంత యువతను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం సీఎం క్రీడలను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల శాఖ అధికారి సీతారాం నాయక్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, ఎజీఎఫ్ కార్యదర్శి నాగేశ్వరరావు, వంకేశ్వరం నిరంజన్, వ్యాయామ ఉపాధ్యాయులు సామ రమేష్, సుభాషిని, వెంకటేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply