ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్(Uttarakhand)లో క్లౌడ్‌బరస్ట్(Cloudburst)తో కుంభవృష్టి కురుస్తోంది. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల(Rudraprayag, Chamoli districts)ను వరదలు ముంచెత్తుతున్నాయి. వందల సంఖ్యల కుటుంబాలు బురద నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. అనేక మంది గల్లంతయినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. బుస్కేదర్ తహసిల్లోని బరేత్ దుంగర్ టోక్‌తో పాటు చమోలీలోని దేవల్ ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది.
వరదల్లో చిక్కుకున్న కొన్ని కుటుంబాలు
క్లౌడ్‌బస్ట్‌కు చెందిన విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామీ (CM Pushkar Singh Thami) కన్ఫర్మ్ చేశారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ (rescue operations) చేపట్టినట్లు తెలిపారు. అధికారులతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. బరేత్ దుంగర్ టోక్, దేవల్ ప్రాంతాల్లో శిథిలాల ప్రవాహంలో కొన్ని కుటుంబాలు చిక్కుకున్నట్లు సీఎం థామి తన ప్రకటనలో తెలిపారు.
అనేక చోట్ల రోడ్ల మూసివేత
కుంభవృష్టి తర్వాత ఇద్దరు అదృశ్యమైనట్లు జిల్లా మెజిస్ట్రేట్ సందీప్ తివారీ (District Magistrate Sandeep Tiwari) తెలిపారు. డజన్ల సంఖ్యలో జంతువులు శిథిలాల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. భారీ వర్షాల వల్ల అనేక చోట్ల రోడ్లను మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాల(emergency teams)ను ఏర్పాటు చేశారు.