Clean sweep | పోతేపల్లిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్..
Clean sweep | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తగుళ్ల కొండల్ యాదవ్, సంబంధించిన వార్డ్ మెంబర్స్, పొతేపల్లి గ్రామంలో క్లీన్ స్వీప్(Clean sweep) విజయాన్ని సాధించారు.
కొండల్ యాదవ్ వర్గానికి చెందిన 10వార్డులో పది గెలిచి క్లీన్ స్వీప్ విజయం సాధించడంతో గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party) నాయకులు ఆనందోత్సవాల్లో పొంగిపోయారు. అనంతరం కొండల్ యాదవ్ మాట్లాడుతూ… భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన గ్రామస్తులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేశారు.

