• ఇంద్రకీలాద్రి చుట్టూ విహారం…
  • కొబ్బరికాయ కోట్టి ప్రారంభించిన ఈవో..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada) లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న ఆది దంపతుల గిరి ప్రదక్షణ (GiriPradakshina) అత్యంత వైభవంగా కొనసాగింది. శ్రావణ పౌర్ణమి (SravanaPournami) సందర్భంగా ఆదిదంపతులకు నిర్వహించిన ఈ గిరి ప్రదక్షిణలో నగర పురవీధుల్లో స్వామి వారు అమ్మవారు విహరించారు. పౌర్ణమి రోజు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి (Indrakeeladri) గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం.

శనివారం పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ (Temple Executive Officer V.K. Seenanayak) ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తప్పెట్లు, కోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ (GiriPradakshina) కార్యక్రమం వైభవం సాగింది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. వేలాది మంది భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply