హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సుమారు 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం సినీ పురస్కారాలను ప్రభుత్వం నేడు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అవార్డుల కమిటీ జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ నటి జయసుధ కలిసి ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు.. ఈ అవార్డులు జూన్ 14 వ తేదిన హైదరాబాద్ లోని హైటెక్ లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
ఇక ఉత్తమ చిత్రంగా కల్కీ, ద్వీతీయ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, తృతీయ ఉత్తమ చిత్రంగా లక్కీ బాస్కర్ కు అవార్డులు లభించాయి..
ఉత్తమ బాలల చిత్రం గా ఇది ఒక చిన్న కథ కాదు 35 మూవీకి ప్రకటించారు. పుష్ప 2 లో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకోగా, ఇది చిన్న కథ కాదు 35 మూవీలో నటించిన నివేథా థామన్ ఉత్తమ నటి అవార్డు ఎగరేసుకుపోయింది.. ఇక ఉత్తమ దర్శకుడిగా కల్కీ దర్శకుడు నాగ్ అశ్విన్ కు లభించింది..
అలాగే జ్యూరీ అవార్డులు ఫరియా అబ్దుల్లా – మత్తు వదలరా , అనన్య నాగళ్ల – పొట్టేల్ , దుల్కర్ సల్మాన్ – లక్కీ భాస్కర్ లకు ప్రకటించారు.. ఉత్తమ గాయని గా పుష్ప 2 లో సాంగ్ పాడిన శ్రేయా ఘోషల్ కు , ఉత్తమ గాయకుడిగా సిద్ శ్రీరామ్ – ఊరి పేరు భైరవ కోన కు లభించాయి.
ఉత్తమ కోరియోగ్రాఫర్ గా దేవర మూవీకి పని చేసిన గణేష్ ఆచార్య , ఉత్తమ స్ర్కీన ప్లే అవార్డు వెంకీ అట్లూరి – లక్కీ బాస్కర్ కు లభించాయి.
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ ఇవే..
- కల్కి 2898ఏడీ (మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
• పొట్టేల్ (రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్) - లక్కీ భాస్కర్ (మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
ఉత్తమ నటీనటులు వీళ్లే..
- ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప 2)
- ఉత్తమ నటి- నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు)
- ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ సహాయ నటుడు: ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) • ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
- ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
- ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
- ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్) - ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథెడ్డి (గామి)
*ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య – దేవర
*ఉత్తమ హెరిటేజ్ ఫిచర్ ఫిల్మ్ – రజకార్
కాగా, 2014 నుంచి 2023 వరకు అవార్డులను త్వరలోనే ప్రకటిస్తామని జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులను అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా, అవార్డుల విజేతల జాబితాను నేడు వెల్లడించారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అవార్డులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి, జయసుధను జ్యూరీగా నియమించింది. మార్చి 13వ తేదీ నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించిన జ్యూరీ, వాటిని పరిశీలించి తుది జాబితాను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా రంగ ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి ఒక ఉత్తమ చలనచిత్రానికి ఈ గద్దర్ అవార్డును అందించనున్నారు. కేవలం ఉత్తమ చిత్రాలకే కాకుండా, నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా పురస్కారాలు ఉంటాయి.
వీటితో పాటు, జాతీయ సమైక్యతను చాటిచెప్పే చిత్రాలు, ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలంగాణ వారసత్వం, పర్యావరణం, చరిత్ర వంటి అంశాలపై నిర్మించిన సినిమాలకు కూడా ప్రత్యేక పురస్కారాలు అందజేస్తారు. యానిమేషన్ సినిమాలు, తొలిసారి దర్శకత్వం వహించిన వారి చిత్రాలు (డెబ్యూ ఫీచర్ ఫిల్మ్), డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు (సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్), లఘు చిత్రాల (షార్ట్ ఫిల్మ్) విభాగాల్లోనూ గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన వారికి, పుస్తకాలు ప్రచురించిన వారికి, అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా గద్దర్ పురస్కారాలు దక్కాయి. గతంలో ప్రకటించిన కాంతారావు, పైడి జయరాజ్, ఎం. ప్రభాకర్ రెడ్డి వంటి ప్రముఖుల పేర్లతో ఉన్న అవార్డులను కూడా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.