Chukka Ramaiah | చుక్క రామయ్య సెంచ‌రీ.!!

Chukka Ramaiah | చుక్క రామయ్య సెంచ‌రీ.!!

కరీమాబాద్ (ఆంధ్ర ప్రభ) : ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య (Chukka Ramaiah) సెంచరీ 100 వసంతాలు (100th birthday) పూర్తి చేసుకుని ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. చుక్కారామయ్య గురువారం నాటికి 100 ఏట అడుగు పెట్టి సెంచరీ సాధించారు. ప్రముఖ విద్యావేత్త మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ1925 నవంబర్ 20న చుక్క రామయ్య జన్మించారు.

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి కేటీఆర్, ప్రొఫెసర్ కోదండరాం తదితర ప్రముఖులు హైదరాబాదులోని విద్యానగర్ కాలనీకి వెళ్లి చుక్కారామయ్యకు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమధ్య కాలంలో ప్రముఖులుగా గుర్తించబడిన వాళ్లలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్లు ఎవరు లేరనే చెప్పాలి.

పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ ఆరోగ్యం విషయంలో ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించే రామయ్య… నేడు శతకంలోకి అడుగుపెట్టారు. ఐఐటీకి మారుపేరు చుక్కారామయ్య ఉభయ రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుండి ఎందరో విద్యార్థులు చుక్కారామయ్య దగ్గర ఐఐటిశిక్షణ పొంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని వివిధ రంగాలలో స్థిరపడ్డారు. ఐఐటి అంటేనే చుక్క రామయ్య చుక్కారామయ్య అంటేనే ఐఐటి దేశవ్యాప్తంగా ఆయన పేరు ప్రసిద్ధి గాంచింది.

నేడు వివిధ రంగాలలో స్థిరపడ్డ వేలాదిమంది విద్యార్థులు ఆయన వద్ద ఐఐటి శిక్షణ పొందిన వారే ప్రముఖ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. చుక్కారామయ్య మరెన్నో ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply