Christmas | సెమీ క్రిస్మస్ వేడుకల్లో..

Christmas | సెమీ క్రిస్మస్ వేడుకల్లో..

Christmas, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం గుడ్ మేన్ పేటలో జాకబ్ మెమోరియల్ చర్చెస్, పాస్టర్ విజయ్ బాబు, ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు అంటే సంతోషానికి ప్రతిరూపం లాంటిదని.. సర్వజనుల పై క్రీస్తు దేవుని కరుణ కటాక్షాలు ఉండాలని గుడివాడ (Gudivada) ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. అనంతరం క్యాండిల్ సర్వ్ చేసిన ఎమ్మెల్యే, కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పేద చిన్నారులకు నోట్ పుస్తకాలు.. నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. క్రిస్మస్ శోభ ఉట్టిపడేలా నేడు జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమనీ హర్షం వ్యక్తం చేశారు. క్రైస్తవ సోదరులందరూ క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ (TDP) నాయకులు చేకూరు జగన్మోహన్రావు, వేశపోగు ఇమ్మానుయేలు, గూడూరు సురేంద్ర, యేసబు, చిన్న, నితీష్, రవీంద్ర, సాల్మన్, విక్రమ్, పాస్టర్స్ కే ఎలిజ, రత్నాకర్ (చంటి ), ఎమ్. రాజు, ఎలీషా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply