Chityala | 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం – ఇద్దరి మృతి

నల్లగొండ : చిట్యాల మండలం, పెద్దకాపర్తి వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది..

అతి వేగంగా వస్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న రెండు కార్లు , కంటైనర్ లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *