Chityala | ప్రజాతంత్ర సభకు బయలుదేరిన మహిళలు..

Chityala | ప్రజాతంత్ర సభకు బయలుదేరిన మహిళలు..
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14 వ మహా సభల సందర్భంగా 26 నుండి 28 వరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ అన్నారు. చిట్యాల మున్సిపల్ పరిధిలోని మహిళలు, విద్యార్థినీలు రాజకీయాలకు అతీతంగా పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు రుద్రారపు పార్వతమ్మ, మేడి సుగుణమ్మ, బూరుగు కృష్ణ వేణి, కడగంచి అండాలు, బొడ్డు లక్ష్మి, లడే విజయలక్ష్మి మేడి శోభ, జనపాల జ్యోతి, బద్దుల మమత, జిట్ట రమాదేవి, ఇందిరా, ఐతరాజు యాదమ్మ, పి అండాలు తదితరులు పాల్గొన్నారు.
