Chityala | విద్యుత్తు సమస్యలు లేకుండా చేస్తాం..

Chityala | విద్యుత్తు సమస్యలు లేకుండా చేస్తాం..
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామంలో 12 వార్డులలో విద్యుత్ లోవోల్టేజ్ సమస్యలు లేకుండా చూడడమే ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం తెలిపారు. ఈ రోజు మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో 12వ వార్డులో విద్యుత్ సమస్యలపై విద్యుత్ అధికారి ఏఈ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అన్ని వార్డులలో అవసరాల మేరకు విద్యుత్ లైట్లు సమకూర్చడం జరిగిందని తెలిపారు . నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామంలో కరెంట్ లోవోల్టేజీ లేకుండా చూస్తానని మౌలిక వసతులు కల్పన కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఓర్సు సైదులు లైన్మెన్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
