Chityala | రాజకీయాల్లో నూతన ఒరవడి

Chityala | రాజకీయాల్లో నూతన ఒరవడి

  • యువత చూపు బీఆర్ఎస్ పార్టీ వైపు

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : చదువుకున్నయువత టిఆర్ఎస్ వైపు రావడం పార్టీ విధానాలకు లభిస్తున్న ప్రజా మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్లగొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రజలతో పాటు చదువుకున్న యువత కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటూ బిఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.

ఇటీవలే కాలంలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న మున్సిపాలిటీలోని 11వ వార్డుకు చెందిన మారగోని రమేష్ కుమార్తె మారగోని తేజస్విని ఈ రోజు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాలనలో యువతకు విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల ద్వారా బలమైన భవిష్యత్తు చూపిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని యువత గ్రహించి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.

మాటలకే పరిమితమైన రాజకీయాలకు కాకుండా, పనితీరుతో నమ్మకం సంపాదించి పదేళ్ల కాలంలో హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ కీర్తిని దేశమంతా చాటిన కేసీఆర్ పార్టీని ఎంచుకున్నానని తేజస్విని తెలిపింది. చిట్యాల మున్సిపాలిటీలో కేసీఆర్ గారి హయంలో తాము చేసిన అభివృద్ధి ద్వారానే ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అబద్ధపు హామీలు, అమలుకాని ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమై, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని, పాలకులపై అసంతృప్తి పెరుగుతున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు, యువత చూపుతున్న ఆదరణ విశ్వాసం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు..

Leave a Reply