Chityala | భవిత పిల్లల వనరుల కేంద్రానికి టీవీ బహుకరణ…

Chityala | భవిత పిల్లల వనరుల కేంద్రానికి టీవీ బహుకరణ…
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1999 -2000, బ్యాచ్ కు చెందిన జెట్టి కుమార్, కొంక అశోక్, పోతుగంటి శ్రీధర్, చిలుముల రాజేందర్ ,లు బుధవారం స్థానిక భవిత( ప్రత్యేక అవసరాల గల పిల్లల వనరుల కేంద్రం ) పాఠశాల పిల్లల సౌకర్యార్థం ఎల్ఈడి (టీవీ )ని ఎంఈఓ కొడెపాక రఘుపతి సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఎంఏఓ కోడెపాక రఘుపతి మాట్లాడుతూ తాము చదువుకున్న ఊరి కోసం పాఠశాలకు సేవా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి శ్రీనివాస్, ఐఎఫ్ ఆర్ పి సంద మహేందర్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాజీపేట రవీందర్, ఉపాధ్యాయులు బండారి సదయ్య, భాస్కర్, వందన ,కేర్ టేకర్ కళావతి, ఫిజియోథెరపిస్ట్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
