CHITTOORU LOST | చిత్తూరులో.. చతికిల

CHITTOORU LOST | చిత్తూరులో.. చతికిల
చంద్రబాబుపై దాడితో.. చివరి దశ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నక్సలైట్ ఉద్యమం ఒకప్పుడు తీవ్ర ఉగ్రరూపంతో ప్రాంతీయ రాజకీయ, సామాజిక పరిస్థితులను ముఖ్యంగా ప్రభావితం చేసింది. పేదరికం, భూస్వామ్య దోపిడీ, సామాజిక అసమానతలు, ప్రభుత్వ యంత్రాంగంపై అసంతృప్తి వంటి కారణాలతో యువత నక్సలైట్ (Youth Naxalite) భావజాలంవైపు ఆకర్షణకు ప్రధాన కారకంగా నిలిచాయి. 1980ల నుంచి 2000ల ఆరంభ దశ వరకు ఈ జిల్లాలో నక్సలైట్ ల కదలిక విస్తృతంగా కనిపించింది. విలక్షణ భౌగోళిక స్థితి, విశాలమైన అటవీ ప్రాంతాలు, తూర్పు–దక్షిణ సరిహద్దుల కలయికతో ఈ ప్రాంతం నక్సలైట్ల కార్యకలాపాలకు నిలయంగా మారింది. తవణంపల్లి మండలానికి చెందిన చలపతి రెడ్డి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు. ఆయన ఆధ్వర్యంలో అలిపిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీద హత్యాయత్నం జరిగింది.
ఈ దాడి తర్వాత నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం ముమ్మరమైంది. చలపతి ఎన్కౌంటర్లతో జిల్లాలో నక్సలైట్ల ఉద్యమానికి తెరపడింది. చిత్తూరు జిల్లా ఉద్యమంలో తవణంపల్లెకు చెందిన చలపతి రెడ్డి అనే చలపతి ఒక ప్రతిష్టాత్మక పాత్ర పోషించారు. సెరికల్చర్ (sericulture) శాఖలో ఉద్యోగిగా ఉన్నప్పటికీ పేదల సంక్షేమంపై ఆయన సంకల్పంతో కూడిన ప్రచార కార్యక్రమాలు చేపట్టి పీడిత వర్గాల సమస్యల పరిష్కారానికి తుపాకీ బట్టి నక్సలైట్ గా మారారు. భూ వివాదాలు, స్థానిక ఖాళీలు, దళితులు మరియు గిరిజనుల (Tribal) పట్ల జరిగిన అన్యాయాలపై ఆయన సక్రియంగా స్పందించడం వల్ల ప్రజలలో ఆయనకు విశేష ఆదరణ ఏర్పడింది. ఆయన నేతృత్వంలో సీపీఐ, పిడబ్ల్యూజే వంటి సంస్ధల రూపంలో ప్రాంతీయ నక్సలైట్ బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో కలసి పనిచేసి ప్రభుత్వ వ్యవస్థపై ఒత్తిడిని పెంచే ప్రయత్నాలు చేశారు.
ఈ ఉద్యమంలో అత్యంత సంచలనమైన సంఘటన 2003 అక్టోబర్ 1న తిరుమల ఘాట్ రూట్‌లో అలిపిరి వద్ద జరిగిన దాడి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు (Chief Minister N.Chandrababu Naidu) తిరుమలకు చేరుకునే ముందు గల రూట్‌పై మావోయిస్టులు క్లేమోర్ మైన్లను వదిలి, కాన్వాయ్‌ను లక్ష్యంగా చేస్తూ పేలుళ్లను జరిపారు. తర్వాత అంబుష్ శైలిలో కాల్పులు కూడా జరిపారు. ఈ దాడిలో ముఖ్యమంత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికీ ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు విచారణలు చేపట్టి దాడి వెనుక చిత్తూరు జిల్లా సంబంధిత నేతలుకి సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నక్సలైట్ల సమస్యపై చర్చ ప్రారంభమయ్యింది. అలిపిరి దాడి తర్వాత ప్రభుత్వం పటిష్టంగా స్పందిస్తూ మావోయిస్టు కదలికలపై భారీ నిఘా చర్యలు మొదలెట్టింది. చిత్తూరు, కడప, నెల్లూరు పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక విచారణ, కంపింగ్ ఆపరేషన్లు, గ్రేహౌండ్స్, ఇతర ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. నక్సలైట్ల ఏరివేత ప్రారంభమైంది. శ్రీకాళహస్తి (Srikalahasti) పరిసరాల అడవులు, పిచ్చటూరు, సిద్ధలింగమడుగు, తవణంపల్లి వంటి ప్రాంతాల్లో అనేక ఎన్‌కౌంటర్లు (Encounters) జరుగుతూ కీలక నక్సలైట్ నాయకులను మట్టుబెట్టారు. ఈ దాడుల్లో మంగలి కిష్టప్ప, కేశవ వంటి ప్రాంతీయ కమాండర్లు మరణించారు. దీంతో నక్సలైట్ల దళాలకు గట్టి దెబ్బ తగిలింది. ఆధునిక విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక చర్యలు చేపట్టాయి.
దీంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల (Maoists) మనుగడ క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాజకీయ, సామాజిక చైతన్యం పెరగడం అధికార యంత్రాంగం ప్రజలకు దగ్గర కావడంతో క్రమంగా నక్సలైట్ల ఉద్యమం కనుమరుగయ్యింది. పథకాలకు ప్రాప్యత, రోడ్ల నిర్మాణం, విద్యా, ఆరోగ్య సేవల విస్తరణ తదితర సంక్షేమ చర్యలు గ్రామీణ జీవనానికి స్పష్టమైన మార్పులు తెచ్చాయి. ఇవన్నీ కలిసిపడి నక్సలైట్ ఉద్యమానికి దోహదం చేసే పరిస్థితులను నిరోధించటంలో కీలకంగా పని చేశాయి. అయినప్పటికీ కొన్నిసార్లు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అనుపదప కనిపించాయి. 2004 తర్వాత ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమం చిత్తూరు జిల్లాలో క్రమంగా బలహీనపడినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు, నష్టం నేపథ్యంలో వారికి ప్రజల మద్దతు కరువైంది.

చలపతి వంటి పాతతరం నాయకుల మరణాలు, అధిక స్థాయిలో జరిగిన అరెస్ట్‌లు, పునరావాస పరిష్కారాలు, సమాజంలో వచ్చిన మార్పులు కలిసి నక్సలైట్ కార్యకలాపాలకు బ్రేక్ వేశాయి. దండకారణ్య ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలపతి మృతి చెందడంతో చిత్తూరు జిల్లాలో నక్సలైట్ల ఉద్యమం (Naxalite Movement) తుడిచిపెట్టకుపోయిందని చెప్పవచ్చ. పోలీసుల బలమైన కాంబింగ్ చర్యలు, నాయకుల మరణాలు, లొంగుబాట్ల పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ, యువతలో విధానపరమైన మార్పు కలసి ఉద్యమాన్ని తగ్గించడానికి తోడ్పడ్డాయి. ఫలితంగా, ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలుపై ఆధారపడటంతో మావోయిస్టు ఆకర్షణ తగ్గించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నక్సలైట్ ఉద్యమం నేర్పిన పాఠాల ఆధారంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అదే విధంగా చర్యలు చూసుకుంటే మరో మారు నక్సలైట్ల ఉద్యమం పునరావృతం అయ్యే అవకాశాలు లేవు.
