Chittoor | “ఛలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

Chittoor | “ఛలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

Chittoor |చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఫిబ్రవరి 5న చేపట్టనున్న “ఛలో పోతిరెడ్డిపాడు” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. బంగారుపాళ్యంలో బుధవారం మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ ఎం.బి. కుమార్ రాజా నివాసంలో నిర్వహించిన సమావేశంలో రాయలసీమకు నీటి హక్కుల పరిరక్షణ, ప్రాంతీయ గౌరవం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ రాయలసీమ జీవనాధారమైన ఎత్తిపోతల సాగునీటి పథకాల విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరి రాయలసీమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.

నీటి కోసం, హక్కుల కోసం, రాయలసీమ ఆత్మగౌరవం కోసం పోరాటం తప్పదని, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “ఛలో పోతిరెడ్డిపాడు” ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల భవిష్యత్తు, సాగునీటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, రాష్ట్ర పాల ఏకరి విభాగం అధ్యక్షులు ఎం.బి. కుమార్ రాజా, మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, దత్తాత్రేయ రెడ్డి, థామస్, ఎం.బి. కృష్ణమూర్తి, కామరాజు, కిషోర్ కుమార్ రెడ్డి, అన్ను, రఘుపతి రాజు, వాణిప్రియా, కావలి శ్రీనివాసులు, గజేంద్ర, షాకీర్, శైలేష్ బాబు, సుధాకర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 5న జరిగే కార్యక్రమంలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

Leave a Reply