megastar 10th| వైరలైన చిరు టెన్త్ సర్టిఫికెట్..

megastar 10th | వైరలైన చిరు టెన్త్ సర్టిఫికెట్..

megastar | మెగాస్టార్ చిరంజీవి.. (Chiranjeevi) ఒక వ్యక్తిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. శక్తిగా ఎదిగారు. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నేటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. ఇక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో ఎంతో మందికి నేత్రదానం, రక్తదానం చేస్తున్నారు. గొప్ప మానవతావాదిగా అందరి మనసులు దోచుకున్నారు. ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. తెలుగు సినీ సామ్రాజ్యంలో చక్రవర్తిగా వెలుగుతున్న చిరంజీవి (Megastar) చదువుల్లో ఎలా ఉండేవారు..? టెన్త్ లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు..? అనేది తెలుసుకోవాలనేది ప్రతి అభిమానికి ఉంటుంది. అయితే.. ఇటీవల మెగాస్టార్ టెన్త్ సర్టిఫికెట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కె.ఎస్.ఎస్. వరప్రసాద్ రావు అని రాసి ఉంది. తండ్రి పేరు వెంకటరావు అని రాసి ఉంది. ఆయన పెనుగొండలో జన్మించినట్టు ఈ సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది. అయితే.. ఇందులో ఆయనకు టెన్త్ లో వచ్చిన మార్కులు మాత్రం కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి చిరు టైటిల్ వెనకున్న సీక్రెట్

Leave a Reply