Chiranjeevi | సినిమా ముహుర్తం ఫిక్స్..?

Chiranjeevi | సినిమా ముహుర్తం ఫిక్స్..?
Chiranjeevi | చిరు – బాబీ సినిమా ఆలస్యానికి అసలు కారణం
ఏప్రిల్ 14న సినిమాకు ముహూర్తం ఫిక్స్..?
చిరంజీవి సర్జరీ వల్ల షూటింగ్ ఆలస్యం
మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో..?
చిరంజీవికి జంటగా ప్రియమణి
అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తున్నారా..?
‘కాకా’, ‘కాకాజీ’ టైటిల్స్ పరిశీలనలో
2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్
Chiranjeevi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు 50 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే.. ఇంత వరకు చిరు కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ కానుందో అనౌన్స్ చేయలేదు. డైరెక్టర్ బాబీతో చిరు సినిమా ఫిక్స్ అనేది తెలిసిందే కానీ.. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మూవీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఈ క్రేజీ మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు..? రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?
Chiranjeevi | అసలు కారణాలు ఇవే..

జనవరిలో మన శంకర్ వరప్రసాద్ గారు రిలీజైన తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నారు కానీ కుదరలేదు. కారణం ఏంటంటే.. ఈ క్రేజీ, భారీ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ నిర్మాణ సంస్థ కోలీవుడ్ స్టార్ విజయ్ తో జన నాయగన్ నిర్మించింది. ఆ సినిమా రిలీజ్ కి సెన్సార్ కష్టాలు రావడం.. ఆ బిజీలో ఈ నిర్మాణ సంస్థ ఉండడం వలన లేట్ అయ్యింది. మరో కారణం ఏంటంటే.. చిరు సర్జరీ వలన కూడా ఈ సినిమా సెట్స్ పైకి రావడం ఆలస్యం అయ్యిందని సమాచారం.
Chiranjeevi | ఏప్రిల్ 14న ముహుర్తం..

మార్చిలో ఖచ్చితంగా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. ఈమధ్య కూడా చిరు మరో సర్జరీ చేయించుకోవాల్సి రావడంతో ఈ నెలలో కూడా స్టార్ట్ కావడం లేదట. బాబీ మాత్రం స్క్రిప్ట్ రెడీ చేసి.. చిరు ఎప్పుడంటే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫైనల్ నేరేషన్ కూడా అయిపోయింది. మరి.. ఎప్పుడు పట్టాలెక్కుతుంది అంటే.. ఏప్రిల్ 14న స్టార్ట్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక రిలీజ్ ఎప్పుడంటే.. 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
Chiranjeevi | ఆ రెండు టైటిల్స్ లో..

ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది నిజమేనా కాదా అనేది తెలియాల్సివుంది. చిరంజీవికి జంటగా ప్రియమణి నటిస్తుంది. దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంకా ఇందులో నటించే నటీనటులు ఎవరు అనేది త్వరలో ప్రకటించనున్నారు. ఈ క్రేజీ మూవీకి కాకా, కాకాజీ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ రెండు టైటిల్స్ లో ఏదో టైటిల్ ను ఖరారు చేస్తారని టాక్. ఈ క్రేజీ మూవీ గురించి పూర్తి వివరాలు బయటకు రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
