China Manja | చైనా మాంజను అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు

China Manja | చైనా మాంజను అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు
- చైనా మాంజను స్వాధీనం….
China Manja | గాంధారి,ఆంధ్రప్రభ : నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గాంధారి మండల కేంద్రంలో చికెన్ దుకాణాన్ని నడుపుతున్న మహమ్మద్ అహ్మద్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా తన ఇంట్లో ప్రభుత్వం(Govt) నిషేధించబడిన చైనా మాంజ దారం అమ్ముతున్నారని, పక్క సమాచారం ఉండటంతో, శనివారం ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బందితో కలిసి, అతని ఇంట్లో సోదాలు చేసి, ప్రమాదకరమైన చైనా మాంజాతో పాటు, చరకాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిషేధింపబడిన చైనా మాంజ(China Manja)ను అమ్ముతున్న మహమ్మద్ అహ్మద్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చైనా మాంజాతో మనుషులతో పాటు, ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని, మండలంలో ఎవరైనా ప్రాణాంతకమైన చైనా మాంజాను అమ్మిన, వాటిని ఇండ్లలో నిలువ చేసి పెట్టుకున్న అలాంటి వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
