China Manja | అమ్మినా, కొన్నా కఠిన చర్యలు

China Manja | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ లోని పలు దుకాణాలను మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బి-జోన్ సెంటర్ రాజీవ్ చౌక్ లోని దుకాణ దారులతో మాట్లాడి చైనా మాంజా దారంను ప్రభుత్వం నిషేధించిందని, గతంలో పంతాగులు ఎగిరేసే సమయంలో చైనా మాంజా దారం వాడటం వలన చాలామంది ప్రజలు, వాహనదారులు గాయాలపాయ్యారని, కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారని, రాబోవు సంక్రాంతి పండగ సందర్బంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని దుకాణ యజమానులు ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజా దారం అమ్మవద్దని హెచ్చరించారు. పట్టణంలోని యువకులు, పిల్లలు పంతాగులు ఎగిరేసే సమయంలో ఎవరు చైనా మాంజా దారం వాడకూడదని, పండగను ప్రశాంతంగా, సుఖసంతోషాల మధ్యలో భద్రంగా జరుపుకువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎల్ భూమేష్, లు పలు దుకాణ యజమానులు, యువకులు, హెడ్ కానిస్టేబుల్ జంగు, పాల్గొన్నారు.

Leave a Reply