ChilukurTemple | వంశపారంపర్య అర్చకుడిగా విశిష్ట సేవలు

ChilukurTemple | వంశపారంపర్య అర్చకుడిగా విశిష్ట సేవలు

ChilukurTemple | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత
హుండీ రద్దు – విఐపీ దర్శనాలపై విప్లవాత్మక నిర్ణయాలు
మునివాహన సేవతో చరిత్ర సృష్టించిన మహనీయుడు
ఆలయ స్వయం ప్రతిపత్తి కోసం చట్టపరమైన పోరాటం
విద్యావేత్తగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా సౌందరరాజన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో చిలుకూరు బాలాజీ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఎన్నో ఏళ్లుగా ఆలయ ప్రధాన అర్చకులు ఉన్న సౌందర్‌రాజన్ క‌న్నుమూశారు. కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ రోజు చిలుకూరులోని ఆయ‌న నివాసంలో క‌న్నుమూశారు. సౌంద‌ర‌రాజ‌న్ వ‌య‌సు 90ఏళ్లు. సౌందర్‌రాజన్ మరణవార్త తెలిసి అర్చకలోకం విషాదంలో మునిగిపోయింది. సౌందర్‌రాజన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని దైవాన్ని వేడుకుంటున్నారు. సౌందరరాజన్ తన అర్చక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నత విద్యనభ్యసించాడు. కామర్స్ లెక్చరర్‌గా చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. ముగ్గురు మగపిల్లల్లో రంగరాజన్(ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులు) రెండో వాడు.

ChilukurTemple
ChilukurTemple

వంశపారంపర్య అర్చక కుటుంబంలో జన్మించిన ఆయన, తన తండ్రి రాఘవాచారి నుంచి లభించిన ఆధ్యాత్మిక విలువలతో చిలుకూరు ఆలయాన్ని ఒక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆలయాల్లో హుండీ వ్యవస్థను, విఐపి దర్శనాలను, టికెట్ పద్ధతులను రద్దు చేస్తూ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. దేవుడి ముందు భక్తులందరూ సమానమేనని చాటిచెబుతూ ఆర్జిత సేవలను కూడా నిలిపివేశారు.

ఆయన సేవలు కేవలం ఆలయానికే పరిమితం కాలేదు. సమాజంలో కుల వివక్షను రూపమాపేందుకు ఒక దళిత భక్తుడిని తన భుజాలపై మోసుకుని ఆలయ ప్రవేశం చేయించి ‘మునివాహన సేవ’ ద్వారా చరిత్ర సృష్టించారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి చట్టపరమైన పోరాటాలు చేసిన ఆయన, అర్చక హక్కుల పరిరక్షణలో అగ్రగామిగా నిలిచారు. ఒక ఇంజనీర్ తార్కికతను, అర్చకుడి ఆధ్యాత్మికతను జోడించి చిలుకూరు క్షేత్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ గారు మరణించారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా ఎంతో మంచి పేరు గడించిన సౌందర రాజన్ గారు ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. సౌందర రాజన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు. సౌందర రాజన్ గారి మృతిపట్ల ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి, శ్రేయోభిలాషులకు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply