Chilpur | విద్యార్థి మృతి పట్ల ఎంపీ కడియం కావ్య దిగ్భ్రాంతి

Chilpur | విద్యార్థి మృతి పట్ల ఎంపీ కడియం కావ్య దిగ్భ్రాంతి
Chilpur | చిలుపూర్, ఆంధ్రప్రభ : జర్మనీ దేశంలోని మాగ్డేబర్గ్ నగరంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో వరంగల్ పార్లమెంట్ (Parlament) నియోజకవర్గం జనగామ జిల్లా పరిధిలోని చిల్పూర్ మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అగ్నిప్రమాద ఘటనలో ప్రమాదవశాత్తు హృతిక్ రెడ్డి మృతిచెందడం పట్ల వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
2025 డిసెంబర్ 30న అర్ధరాత్రి సమయంలో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో (Apprtment) జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. ఈ సంఘటన ఆయన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర శోకంలో ముంచిందని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎంపీ డా.కడియం కావ్య మృతుని కుటుంబానికి పూర్తిస్థాయి సహాయం అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టారు.
31వ తేదీ నుండి జర్మనీలోని భారత రాయబార కార్యాలయం (బెర్లిన్), జర్మనీ (Jarmani) అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మృతుని కుటుంబానికి సంబంధించిన చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా భారత రాయబార కార్యాలయం సహకరించాలని ఎంపీ కోరారు. మృతుని కుటుంబానికి ధైర్యం కల్పిస్తూ, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హృతిక్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
