పసి ప్రాణం బలి..
- కర్నూలులో ఘోరం….
మంత్రాలయం (ఆంధ్రప్రదేశ్): కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం సుగూరు గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల బండి ప్రమాదంలో ఓ 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే —
గ్రామానికి చెందిన రైతు కాజా తన ఎద్దుల బండితో పొలానికి వెళ్తుండగా, ఎద్దులు అకస్మాత్తుగా బెదురుకు గురై అదుపు తప్పాయి. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన వీరనాగప్ప, వీరమ్మల కుమారుడు బీరప్ప (10) పై ఎద్దులు దాడి చేశాయి. తీవ్ర గాయాల వల్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.