Chilakaluripet Town | ఆంధ్రప్రభ ఎఫెక్ట్ …

Chilakaluripet Town | ఆంధ్రప్రభ ఎఫెక్ట్ …
- పారని మురుగు – ప్రమాదంలో ప్రజారోగ్యం..
- ఆంధ్రప్రభ వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు
Chilakaluripet Town | చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ ప్రచురించిన వార్త ” పారని మురుగు- ప్రమాదంలో ప్రజారోగ్యం వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు మంగళవారం కళామందిర్ సెంటర్లో ఉన్న ప్రధాన మురుగు కాలువలో ఉన్న సిల్ట్‌ను తీసివేసి డ్రైనేజీల పారుదల ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరి ఇన్స్పెక్టర్ సునీత మాట్లాడుతూ.. ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తీసివేసిన కారణంగా ఇప్పుడు డ్రైనేజీల పారుదలకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆదేశాలతో వెంటనే చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. నరసింహ స్వామి గుడి వద్దనుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్, కళామందిర్ థియేటర్, రమేష్ బాబు ఆసుపత్రి బజారు వచ్చే డ్రైనేజ్ వాటర్ ఇకనుంచి ఎక్కడ ఆగకుండా పారుదల ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వార్త ప్రచురించిన ఆంధ్రప్రభ దినపత్రిక స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

