Chief Minister Revanth Reddy | అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Chief Minister Revanth Reddy | అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Chief Minister Revanth Reddy | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేత్రుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం భీమ్‌గల్ పట్టణానికి చెందిన సుమారు 150 మంది వివిధ పార్టీ ల నుండి కాంగ్రెస్ లో చేరారు.

వీరికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ముత్యాల సునిల్ కుమార్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం(development is possible) అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం ఖాయం అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.

ఇచ్చిన హామీలు నిలుపుకుని ప్రజల అభిమానం(people’s affection) పొందుతున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ కు ప్రజలు అండగా నిలుస్తున్నారని అనడానికి స్వచ్చందంగా చేరికలు నిదర్శనం అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు పార్టీ లో చేరిన వారు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బోదిరే స్వామి, జేజే నర్సయ్య, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు బర్ల గంగామోహన్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, అనంత్ రావు, మాజీ సర్వ సమాజ్ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, వాక మహేష్, శ్యామ్ రాజ్, మహేష్, సాయిబాబా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply