Chandrababu | పెట్టుబడులకు ఏపీ సిద్ధం
Chandrababu | విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హామీ ఇచ్చారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో గురువారం నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ భేటీలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూరప్ నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు.

“మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ముందంజలో ఉంది (lead AP ) . గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు రానున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పోర్టులు, రైల్వే అనుసంధానానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన ఆలస్యాలు, అవినీతిని అడ్డుకునేందుకు కొత్త విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని, యూరప్ దేశాల (European countries) తో సహకారం పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు పాల్గొని, ఏపీలో అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. యూరప్ వ్యాపారవేత్తలు ఏపీ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు.


