హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: అడవులు, వన్యప్రాణులను కాపాడేందుకు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన అటవీ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(A. Revanth Reddy) పేర్కొన్నారు. ఈ రోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఎక్స్ వేదిక(X platform)గా ఆయన వారి త్యాగాలను స్మరిస్తూ పోస్ట్ పెట్టారు. వన్యప్రాణులు, అటవీ సంరక్షణ, ప్రకృతిని కాపాడినప్పుడే వారికి నిజమైన నివాళి అని అన్నారు. ప్రతి ఒక్కరూ వన్యప్రాణులు కాపాడటానికి, అటవీ సంరక్షణకు సహకరించాలని కోరారు.

Leave a Reply