చంద్రబాబు, రమణాచారి చేతుల్లో ఒకేసారి పురాణపండ శ్రీమాలిక

చంద్రబాబు, రమణాచారి చేతుల్లో ఒకేసారి పురాణపండ శ్రీమాలిక

అక్షజ్ణ వేడుకలో బ్నిమ్, విద్యా వెంకట్‌లపై ప్రశంసల వర్షం….

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలుగు రాష్ట్రాల్లో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రముఖ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం ‘ శ్రీమాలిక ‘ చేసిన పవిత్ర సందడి ఎందరో కవులను, రచయితలను, విమర్శకులను, రసజ్ఞులనే కాకుండా వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక రాజకీయా రంగాల దిగ్గజాలను సైతం ఆశ్చర్య పరుస్తూ … అభినందనలు వర్షింప చెయ్యడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమర్పణలో ఉగాది సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా జరిగిన ఉగాది మహావేడుకల్లో కాల గణనాల పంచాంగం , వ్యవసాయ పంచాంగం లను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురాణపండ శ్రీనివాస్ ఇరవై ఏడవ పునః ప్రచురణ ‘ శ్రీమాలిక ‘ నాలుగు వందలపేజీల వైదిక విలువల మహా గ్రంధాన్ని ఆవిష్కరించి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగాది వేడుకల్లో పాల్గొన్న రసజ్ఞులకు శ్రీమాలిక గ్రంధాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సుమారు మూడువేల ప్రతులను వితరణ చెయ్యడం విశేషం.

అయితే … ఉగాది ముందు రోజే విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన పురాణపండ తాను ఉయ్యూరులో ఉగాది వేడుకలకు హాజరవుతున్నట్లు… అందుకే ముందుగా ముఖ్యమంత్రికి, ఆనం రామ నారాయణ రెడ్డికి స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో మూడు రోజులుగా అనేక చోట్ల జరుగుతున్న ఉగాది వేడుకల్లో పురాణపండ శ్రీనివాస్ వైదిక సృజన వైభవం ‘ శ్రీమాలిక ‘ గ్రంధం సృష్టిస్తున్న పరమ పవిత్ర హంగామా అంతా ఇంతాకాదు.

హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో ప్రముఖ సారస్వత సాంస్కృతిక ప్రచురణ సంస్థ అక్షజ్ణ పబ్లికేషన్స్ సమర్పణలో అత్యంత వైభవంగా చక్కని అనుబంధాల ఆత్మీయతల వాతావరణంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో మున్ముందుగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వైదిక రచనా సంకలన పరిమళం ‘ శ్రీమాలిక ‘ దివ్య గ్రంధాన్ని తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి కే.వి. రమణాచారి ఆవిష్కరించడం మరొక ప్రత్యేకతగానే చెప్పాలి.

స్వచ్ఛమైన హృదయంతో అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రామాణిక విలువల్ని పాటించి మహోన్నత గ్రంధాలను రచించి , సంకలనీకరించి ప్రచురించే పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధ ధార్మిక సేవ గురించి రమణాచారికి తెలుసు కాబట్టే ఎన్నో సభల్లో పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలను ఆవిష్కరించడమే కాకుండా శ్రీనివాస్ ను రమణాచారి విశేషంగా ప్రోత్సహిస్తారు కూడా అనేది వేలాది రసజ్ఞులకూ ఎరుకే ! మీరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయమేమంటే … అక్షజ్ణ సంస్థ నిర్వాహకులు విద్యా వెంకట్, అక్షజ్ఞ సీఈవో శ్రీమతి విద్యా భార్గవి దంపతుల సంస్కార హృదయాన్ని, అక్షజ్ణ నిర్మాణాత్మక కార్యక్రమలో ప్రధాన భూమిక నిర్వహించే నిర్వాహకులు ప్రముఖ రచయిత, కార్టూనిస్ట్ బ్నిమ్ ల అంకిత హృదయాన్ని అక్కడ హాజరైన ప్రేక్షకులు అభినందిస్తూనే ఉన్నారు.

పురాణపండ శ్రీనివాస్ మంత్ర సృజన శ్రీమాలిక వంటి వైదిక మంత్ర పేటికను ఆడియన్స్ అందరికీ ఉచితంగా అందించిన అక్షజ్ణ సంస్థకు రసజ్ఞకలోకం కృతజ్ఞతలు ప్రకటించింది. సభలో ప్రధానాంశమైన ఉగాది పురస్కారాల వేడుక రమణాచారి గంభీర ప్రసంగం పలుకుల మధ్య … ప్రముఖ దర్శకులు విఎన్.ఆదిత్య, ప్రముఖ సంగీత దర్శకులు కలగా కృష్ణ మోహన్, సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, ప్రముఖ సినీ నటి దివ్యవాణి తదితరులు అతిధులుగా పాల్గొనగా … నాట్యగురువు పద్మభూషణ్ దీపికారెడ్డి, సిగ్నేచర్ స్టూడియోస్ సీఈవో అంజలి, ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి, వైదిక ప్రముఖ్ అయ్యగారి జయలక్ష్మి, సీనియర్ జర్నలిస్ట్, సోషల్ మీడియా ఫేమస్ ప్రెజెంటర్ పురాణపండ వైజయంతిలకు ఘన సత్కారం చేసి పురస్కారాలను అందజేశారు. ఈ వేడుక ఆద్యంతం కుటుంబ వాతావరణాన్ని తలపించిందని పలువురు ప్రముఖులు కార్టూనిస్ట్ బ్నిమ్ ని, విద్యా వెంకట్ ని ప్రశంసించడం సభానంతరం కనిపించింది.

Leave a Reply