చంద్రబాబు కర్మయోగి… బౌద్ధ గురువు బంతేజి…

చంద్రబాబు కర్మయోగి… బౌద్ధ గురువు బంతేజి…

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : బుద్ధుడు నడయాడిన అమరావతి అభివృద్ధి కోసం తన శక్తి యుక్తులు ధారబోస్తున్న ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు కర్మయోగి అని ప్రముఖ బౌద్ధ గురువు దమ్మ దజ బంతేజి కొనియాడారు. అమరావతికి చట్ట బద్ధత కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సచివాలయంలో కలిసి బౌద్ధ కండువతో సత్కరించి బుద్దుడి ప్రతిమను ఆయనకు అందజేశారు.

రాజధాని అమరావతికి అన్నీ అరిష్టాలు తొలిగిపోయాయని, భవిష్యత్తులో ప్రముఖ నగరాలలో ఒకటిగా విరాజిల్లుతుంది అన్నారు. అందుకు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబుకి అండగా ఉండి ఆశీస్సులు అందజేయాలని కోరారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Reply