Chief Minister | సీఎంవోలో ముద్దాడి మార్క్..!
- ముఖ్య కార్యదర్శి రవిచంద్ర సేవలు భేష్
- సీఎం పర్యటనలకు పక్కా ప్రణాళికలు
- రూట్‌మ్యాప్ ప్లానింగ్ లోనూ సూపర్ సక్సెస్
- ఫైల్స్ క్లియరెన్స్‌లోనూ జెట్ స్పీడ్
- 2014-19, 2019-24 సీఎంవో అధికారులపై విమర్శల జడివాడ
- ఓటమి తరువాత ఇదే హోదాలో పనిచేసిన వారిపై తీవ్ర అసంతృప్తి
- జవాబుదారీతనంతో వ్యూహాత్మకంగా రాణిస్తున్న ముద్దాడి
- గత అధికారులకు భిన్నం.. అదే రవిచంద్ర బలం
- అందరితో మమేకం.. అద్భుత సమన్వయం పరిపాలనాపరమైన అంశాల్లో సత్వర నిర్ణయాలు
- సీఎం చంద్రబాబు లక్ష్యాలకనుగుణంగా అడుగులు
ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అడు గులు వేసే విషయంలో సీఎంవో అధికారులది కీలక పాత్ర… అంత ప్రాధాన్యతగల పాత్రలో ఒదిగి.. అందరినీ మెప్పిస్తూ.. నొప్పించకుండా రాణించాలంటే కత్తిసాము లాంటి నేర్పరితనం అవసరం.. అలాంటిది రోజుకు దాదాపు 18 గంటలకు పైగా పనిచేస్తూ.. విజనరీ నేతగా.. భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడిగా.. వ్యవస్థ ను కాపాడుకునేందుకు సీఈవొ తరహా పాత్ర పోషించే నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababunaidu) వంటి వారివద్ద పని చేయాలంటే.. విషయ పరిజ్ఞానంతోపాటు.. చాకచక్యం.. సమయ స్ఫూర్తి.. ముక్కుసూటితత్వం.. అన్నిటికంటే ముఖ్యంగా పనిపట్ల అంకితభావం ఉం డి తీరాల్సిందే… విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో ఇప్పటి వరకు సీఎంవోలో పనిచేసిన వారందరూ అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అందరికీ భిన్నంగా.. అంద రివాడిగా పేరు సంపాదించుకున్న ముద్దాడి రవిచంద్ర తనదై నశైలిలో ముందుకు సాగుతూ అన్నిశాఖల అధికారులు.. ప్రజా ప్రతినిధులు.. ప్రముఖులతో పాటు.. ముఖ్యమంత్రి కార్యాల యానికి విచ్చేసే ప్రతిఒక్కరి ప్రశంసలను సొంతం చేసుకుంటు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజువారి కార్యక్రమాల నిర్వ హణ.. ప్రభుత్వ శాఖల పనితీరుపై పర్యవేక్షణ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ.. వాటి పరిష్కారంతో పాటు ముఖ్య మంత్రి ఆదేశాల అమలుకు రవిచంద్ర అవిశ్రాంతంగా శ్రమిస్తు న్నారు… ప్రభుత్వ పాలనాపరమైన విధి విధానాల రూపకల్ప నలోనూ ముద్దాడి రవిచంద్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు…
Chief Minister | అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంవో కార్యాలయం గుండెకాయ లాంటిది. ముఖ్యమంత్రి కార్యాల యంలో వి ధులు నిర్వహించే ఉన్నతాధికారులు కూడా అంతకు రెండింతలు ప్రాధాన్యత కలిగి ఉంటారు. ఇటు ప్రభుత్వానికి, అటు శాఖాధిపతులను సమన్వయం చేసుకుంటూ సీఎంవో కార్యకలాపాలు సాగాలి. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకను గుణంగా ప్రభుత్వ లక్ష్యాలుంటే.. వాటిని ఆధారం చేసుకొని ముందుకు సాగుతుంటే ఇక సీఎంవో ఉన్నతాధికారి పనితీ రును ప్రతిఒక్కరూ ప్రశంసించి తీరాల్సిందే. సరిగ్గా ముద్దాడి రవిచంద్ర విషయంలో కూడా అదే జరుగుతుంది. ఓ వైపు ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబునాయుడు రోజువారి కార్యక్ర మాలను సక్సెస్ ఫుల్‌గా నిర్వహిస్తూనే మరోవైపు సీఎంవో కార్యాలయానికి నిత్యం విచ్చేసే సీనియర్ ఐఏఎస్‌లు, ఆయా శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లకు పూర్తి సమయం అందు బాటులో ఉంటూ సీఎంవో కార్యాలయం సేవలు భేష్ అనిపిం చుకుంటున్నారు. అతి తక్కువ సమయంలోనే ఇటు ప్రభుత్వ వర్గాలతో పాటు అటు అధికార వర్గాల్లో కూడా సమర్థవం తమైన అధికారిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగవంతంగా ఫై ళ్ల క్లియరెన్స్, ఇతర కార్యకలాపాలను చేపడుతూ రవిచంద్ర శభాష్ అనిపించుకుంటున్నారు.
గత ప్ర భుత్వాల్లో సీఎంవో ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన అధికారుల తీరుకు పూర్తి భిన్నంగా ఆయన ప్రభుత్వ కార్య కలాపాలను జెట్ స్పీడ్‌తో నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వానికి ప్ర జల్లో మరింత మంచిపేరు వచ్చేలా తన పనితీరును చాటుకుం టున్నారు. ప్రధానంగా సీఎం (CM) నారా చంద్రబాబు నాయుడు ఆయా పథకాలు, కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యట నలకు వెళ్లే సందర్భంలోనూ ఆయా ప్రాంతాల్లో అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే సందర్భంలోనూ సీఎంవో ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేపడుతున్నారు. దీంతో గడిచిన 20నెలల కాలంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు అంచనాలకు మించి విజయవంతం అవుతూ వచ్చాయి. అలాగే ఆయా ప్రాంత ప్రజలకు అవసరమైన సౌక ర్యాలు, ఇతర వసతులను సమకూర్చే సందర్భంలో కూడా ఆయా శాఖలకు చెందిన అధిపతులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రవిచంద్ర ముందుకు సాగుతున్నారు.
Chief Minister | గత అధికారులకు భిన్నం.. అందరితో మమేకం
విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. తొలిముఖ్యమంత్రిగా నారా చంద్ర బాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీ ఎంవొలో కీలకంగా పనిచేసిన వారిపై, టీడీపీ (Tdp) అధికారం కోల్పోయిన అనంతరం ఎమ్మెల్యేలను చులకగా చూశారని, సరైన గౌరవ మర్యాదలు కూడా ఇవ్వలేదంటూ విమర్శలు వినిపించాయి. కొందరు కీలక ఐఏఎస్‌లు సైతం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థి తులు గతంలో నెలకొన్నాయి. ఆ తరువాత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, సీఎం వొలో కొందరు అధికారులు అంతా తామే అన్నట్లు వ్యవ హరించినట్లు స్వయంగా నాటి సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేలే విలేకరుల ఎదుట వాపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
సీఎంవొలో తమ అభిప్రాయాలను కనీసం వినిపించుకోలేదని, సమయానికి అందుబాటులో లేకుండా పోతారని, ఏదైనా విషయమై చర్చిద్దామంటే కనీసం వినిపించుకునే దిక్కు ఉండేది కాదని, ప్రజా సమస్యలను అసలే పట్టించుకోలేదన్న విమర్శలను వైసీపీ (Ycp) కీలక నేతలే వ్యక్తం చేయడం గమనార్హం. అయితే గత అధికారులకు భిన్నంగా రవిచంద్ర తీరు ఉండ టంతో సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పరి పాలనా పరమైన నిర్ణయాల అమలుతో పాటు, అనేక కీలక ఫైళ్ల క్లియ రెన్స్‌లోనూ ఆయన తన మార్క్ చాటడాన్ని, అందరినీ కలు స్తూ, వారు చెప్పేది వింటూ, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. గత అధికారులకు భిన్నంగా వ్యవహరించడం, అందరితోనూ మమేకం కావడం ఆయనకున్న అదనపు బలమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Chief Minister | రూట్ మ్యాప్ ప్లానింగ్‌లోనూ టాప్ సక్సెస్
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలిసారిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్య తలు చేపట్టిన సందర్భంలో అత్యంత కీలకమైన ఆర్థికశా ఖను రవిచంద్రకు అప్పగించారు. లోటు బడ్జెట్‌తో (Budjet) అనేక ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భంలో కూడా ఆయన తన అనుభవాన్ని ధార పోసి కష్ట కాలంలోనూ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఓ వైపు ప్రభుత్వ కార్యకలా పాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, మరో వైపు లోటు బడ్జెట్ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమ కూరేలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుని అప్పట్లో సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్నారు. ఫలితం గానే నవ్యాంధ్రకు రెండవసారి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక ఆయనకు కీలకమైన సీఎంవో ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన సీఎంవో బాధ్యతలను రవి చంద్రకు ఇవ్వడం వెనుక గతంలో ఆయన చేసిన సేవలు, పనితీరును కొలమానికంగా తీసుకునే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్ట ంగా అర్థమవుతుంది.
అందుకు తగ్గ ట్టుగానే తన సమర్థతను చాటుకుంటూ ప్రతి కార్యక్ర మాన్ని విజయవంతం చేసేలా ముద్దాడి రవిచంద్ర అడు గులు వేస్తున్నారు. ప్రత్యేకించి ప్రతి నిత్యం సీఎంవో కార్య క్రమాలు, సీఎం రూట్ మ్యాప్‌లు, ఆయా శాఖలకు సంబ ంధించి సమావేశాలు, సమీక్షలకు సంబంధించిన ప్లానిం గ్‌లో సీఎంవొ (CMO) అధికార యంత్రాంగం సక్సెస్ రేటు సాధి స్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన ప్రతి కార్యక్రమం రవిచంద్రతో పాటు సీఎంవో అధికారులు పక్కా ప్రణాళి కతో రూపొందించినవే. ఫలితంగానే అతి తక్కువ సమ యంలోనే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు వస్తుంది. సీఎం చంద్రబాబు ఆశయాలకు, లక్ష్యాలకు అను గుణంగా రవిచంద్ర ముందుకు సాగుతుండడంతో ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు అధికార వర్గాలు ఆయన సేవ లను ప్రశంసిస్తున్నారు. ప్రత్యేకించి తనను కలవడానికి సీఎంవోకు వచ్చే అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా వర్గాల వారి సమస్యలను సామరస్యంగా వింటూ వాటిని పరిష్కరించేలా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసు కుంటూ శభాష్ ముద్దాడి అని అనిపించుకుంటున్నారు.
Chief Minister | ఫైల్స్ క్లియరెన్స్‌లోనూ జెట్ స్పీడ్
రాష్ట్ర ంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టాక ఆయా శాఖల పరిధిలో ఫైళ్ల క్లియరెన్స్‌కు సంబం ధించి ఎప్పటికప్పుడు మంత్రులకు (Ministers) ర్యాంకులు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రతి ప్రభుత్వంలోనూ నడిచే అంశమే అయినప్పటికీ సీఎంవోకు మాత్రం ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించిన ఫైల్స్ సీఎంవో కార్యాలయానికి చేరే సందర్భంలో గతంలో కొన్ని ఫైళ్ల క్లియరెన్స్‌లో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చేది. ఇదే విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న ముఖ్యమం త్రులు కూడా అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు.
అయితే కూటమి ప్రభుత్వంలో సీఎంవో ముఖ్యకా ర్యదర్శిగా రవిచంద్ర బాధ్యతలు చేపట్టాక ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెరిగింది. అధికారవర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం బలంగా వినిపి స్తోంది. ఆయా శాఖల నుంచి సీఎంవోకు చేరే కీలకమైన ఫై ళ్లతోపాటు రాష్ట్ర నలుమూలల్లోని ఆయా జిల్లాల నుంచి వచ్చే మరికొన్ని ప్రధానమైన ఫైల్స్ కూడా అతి తక్కువ సమయంలోనే క్లియర్ చేసి పంపుతున్నారు. గతంలో మూడు, నాలుగు నెలలు అయినా కూడా సీఎంవో నుంచి ఫైళ్లు కదిలేవి కావు. రవిచంద్ర (Ravichandra) బాధ్యతలు చేపట్టాక ఎప్పటికప్పుడు ఫైల్ క్లియర్ చేసి, రియల్ టైమ్ గవర్నెన్స్‌కు నిదర్శనంగా నిలవడం ద్వారా సీఎంవో కార్యకలాపాలను వేగవంతం చేసి శభాష్ అనిపించుకున్నారు.

